శ్రీ చెంగాలమ్మ ను దర్శించుకున్న శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థాన చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో వెలసి ఉన్న దక్షిణ ముఖ కాళీ శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి దేవిని మంగళవారం శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థాన చైర్మన్గా నూతన బాధ్యతలు స్వీకరించిన తారక శ్రీనివాసులు దంపతులు దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి వారికి సాదర స్వాగతం పలికి అమ్మనికి విశేష పూజ అనంతరం ఆలయ మర్యాదలతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

వీరి వెంట శ్రీ చెంగాళమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు గోగుల తిరుపాలు,  శ్రీ బాలాంజనేయ స్వామి దేవస్థాన పాలకమండలి సభ్యులు మాదరపాకం  సురేష్  వైసిపి నాయకులు ముప్పాల చంద్రశేఖర్ రెడ్డి,  వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.