తిరుపతి జిల్లా  నాయుడుపేట

నాయుడుపేట లో శ్రీ శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవం

తిరుపతి జిల్లా నాయుడుపేటలో, శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ఘనంగా నిర్వహించారు నాయుడుపేటలో మునుపెన్నడూ లేని విధంగా జాతర మహోత్సవం ఘనంగా నిర్వహించిన దేవాదాయ శాఖ అధికారులు, వెంకటగిరి కనుపూరు, జాతర మహోత్సవం తలపించేలా నాయుడుపేట శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవం శాంతి భద్రతల నడుమ ప్రశాంతంగా జరుగుతుంది, నిన్న రాత్రి జరిగిన ఊరేగింపులో భక్తజనం అధిక సంఖ్యలో పాల్గొని ఊరేగింపు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం ఇంతలా జరిగినందుకు నాయుడుపేట ప్రజలు మరియు చుట్టుపక్కల ప్రజలు అమ్మవారి దర్శనార్థం వచ్చి తమ తమ మొక్కులను తీర్చుకోలేని జాతర నిర్వహించిన తీరును,ప్రతి ఒక్కరు కూడా అభినందించారు, అలాగే నాయుడుపేట ఎస్ ఐ, సీఐ గార్ల ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరగకుండా గట్టి బందోబస్తు తో అమ్మవారి కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ జాతర మహోత్సవం లో, మునుపెన్నడు రాని విధంగా,  అధిక సంఖ్యలో భక్తులు వచ్చి తమ తమ మొక్కులను సంతోషంగా తీర్చుకున్నారు