ఘనంగా చెంగాలమ్మ శరన్నవరాత్రి వేడుకలు

శ్రీ అష్టకాలళిగా శ్రీ శ్రీ శ్రీ చెంగాళ్ళమ్మ పరమేశ్వరి దేవి.

 తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట:-

పట్టణంలో వెలసినఉన్న శ్రీ చెంగాళ్ళమ్మ పరమేశ్వరి దేవి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలలో భాగంగా గురువారం నాల్గవ రోజు అమ్మవారు శ్రీ అష్ట కాళీ అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శ్రీ అష్టకాలి అలంకారం ఉభయకర్తలగా హైదరాబాదుకు చెందిన మద్దాలి చరణ్ కుమార్ రెడ్డి, లక్ష్మీ ప్రియా రెడ్డి దంపతులు వ్యవహరించారు  శరన్నవరాత్రి సందర్భంగా చెంగాళ్ళమ్మ తల్లికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయంలో చండీయాగం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా సూళ్లూరుపేటకు చెందిన మాదరపాక జగన్మోహన్, గౌరీ దంపతులు వ్యవహరించారు. ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి ఆలయ కార్య నిర్వహణ అధికారి ఆళ్ళ శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో ఈ చండీయాగం నిర్వహించారు.

కోళ్ళమిట్ట నుండి "సారే"

శరన్నవరాత్రులు సందర్భంగా అమ్మవారికి "సారె" ను  కోళ్ల మిట్ట, రాఘవయ్యపేట, రాజీవ్ నగర్, ఇసుకమిట్ట, రైల్వే గేటు, హనుమాన్ వీధి ప్రాంతాలకు చెందిన భక్తులు భక్తి శ్రద్ధలతో బయలుదేరారు. ఈ" సారె" కార్యక్రమం కోళ్ల మిట్ట చెంగాళ్ళమ్మ చెట్టు నుండి భక్తులు బయలుదేరారు. భక్తులతో పాటు ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి, ఆలయ ఈఓ ఆళ్ల శ్రీనివాసులు రెడ్డి కూడా ఉన్నారు. ఈ ఊరేగిపు బాణాసంచాల మధ్య డప్పులు, మంగళ వాయిద్యాల నడుమ వీర జాటీలతో భక్తులు   కోలాహంగా  బయలుదేరి ఆలయ వద్దకు చేరుకున్నారు. ముందుగా చెంగాలమ్మ చెట్టు వద్ద పూజలు నిర్వహించి అనంతరం భక్తులందరూ ఆలయం లోకి వెళ్లి అమ్మవారికి స్వయంగా "సారె" ను సమర్పించారు. సాయంత్రం ఆలయంలో నెల్లూరుకు చెందిన లవ్లీ ఈవెంట్ వారిచే నృత్య ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ నృత్య ప్రదర్శన కార్యక్రమం ప్రజలను ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి, కళత్తూరు జనార్దన్ రెడ్డి, ఆలయ ధర్మకర్త మండలి సభ్యులు ముప్పాళ్ళ చంద్రశేఖర్ రెడ్డి వంకా దినేష్ కుమార్ కర్లపూడి సురేష్ బాబు ఓలేటి బాల సత్యనారాయణ మన్నెముద్దుల పద్మజా నాయుడు కుప్పం నాగమణి బండి సునీత, పెనుభేటీ మారమ్మ, ఎక్స్ అఫీషియో సభ్యులు కీసరపల్లి నరేంద్ర, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.