శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానము హుండీ లెక్కింపు




నెల్లూరు కల్చరల్ మేజర్ 

న్యూస్శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానము,కొండబిట్రగుంట కు సంబందించిన హుండిల లెక్కింపు కార్యక్రమము జనవరి 24వ తేది అనగా శుక్రవారము లెక్కింపు కార్యక్రమము జరిగింది.హుండీల లెక్కింపు కార్యక్రమము నందు కార్యనిర్వహణాధికారి 

A.రాధాకృష్ణయ్య అధ్వర్యములో లెక్కింపు చేశారు. హుండీ లెక్కింపు పర్యవేక్షణాధికారిగా గండవరం గ్రూపు టెంపుల్స్ కార్యనిర్వహణాధికారి ఉమా భాయ్  మరియు దేవస్థాన మాజీ చైర్మన్ శ్రీరామ్ మాల్యాద్రి  హాజరు అయినారు. హుండి లెక్కింపు కార్యక్రమములో  దేవస్థానము సిబ్బంది మరియు హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు కావలి బ్రాంచ్ మేనేజర్ A.లక్ష్మి నారాయణ మరియు బ్యాంకు సిబ్బందితో పాటు వివిధ సేవా సంస్థ సభ్యులు సైతం పాల్గొన్నారు.పై విషయం గురించి కార్యనిర్వహణాధికారి A.రాధాకృష్ణయ్య  మాట్లాడుతూ హుండీ ఆదాయం రూ.11,07,040 /- వచ్చింది అని 90 రోజులకు గాను ఈ మొత్తం వచ్చింది అని తెలియజేసారు.