శ్రీ పొట్టి శ్రీరాములు బస్టాండ్ (ఆత్మకూరు బస్టాండ్) ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆర్టీసీ జోనల్ చైర్మన్.




నెల్లూరు నగరంలోని శ్రీ పొట్టి శ్రీరాములు బస్టాండ్ ని ఆకస్మికంగా నెల్లూరు ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి పరిశీలించారు.అధికారులతో మాట్లాడి మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి ఇక్కడికి రావడం జరిగిందని,200 పైగా బస్సులు వివిధ ప్రాంతాలకి ,వివిధ జిల్లాలకు ప్రయాణిస్తుంటాయని, ప్రజలు కూర్చోవడానికి తగిన కుర్చీలు లేవని నాశరకంగా ఉన్నాయని, ఎమ్మార్పీ రేట్లకే అమ్ముతున్నారా లేదా అనే విషయాన్ని వ్యాపారస్తులు దగ్గరే అడిగి తెలుసుకున్నారు  , ఈ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఆయన అన్నారు. పరిసరాల పరిశుభ్రత ఇంకొంచెం మెరుగుపడాల్సిన అవసరం ఉందని టాయిలెట్స్ కానీ, ప్రధానంగా ట్రాఫిక్ సమస్యను కూడా పరిష్కరించాలని ఇంతకుముందు ఎస్పీ గారిని కోరారని,మారుమూల ప్రాంతాలకు కూడా మరిన్ని బస్సులు వేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ శివ కేశవ్, సునీల్ సుబ్బరాజు చిలకా ప్రవీణ్ కుమార్ ముని చైతు బండారు సురేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.