శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానము,
శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానము,
మూలాపేట, నెల్లూరు
తేది 11.02.2025
హుండీ (పరకామణి సేవ) లెక్కింపు
నెల్లూరు, మూలాపేటలో వేంచేసియున్న శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానములో తేది 11.02.2025 మంగళవారము నాడు హుండీ లెక్కింపు జరిగింది. ఈ కార్యక్రమములో తేది 03.12.2024 నుండి తేది 11.02.2025 వరకు దేవదాయ ధర్మదాయ శాఖ, ఇన్ స్పెక్టర్ శ్రీ యం.సుధీర్ వారి ఆధ్వర్యములో హుండీ లెక్కింపు కార్యక్రమము జరిగినది. ఇందులో భాగంగా దేవస్థానానికి రూ.4,44,846/- హుండీ ద్వారా ఆదాయం లభించింది. పై కార్యక్రమములో కార్యనిర్వహణాధికారి శ్రీ వి.గిరికృష్ణ గారు, ఉస్తవ కమిటీ చైర్మన్ శ్రీ ఒట్టూరు సురేంద్రయాదవ్ గారు మరియు సభ్యులు, శ్రీ వి.జయప్రకాష్ స్వామి మరియు పరకామణి సేవా సభ్యులు పాల్గొన్నారు.
ఇట్లు
(వి.గిరికృష్ణ)
కార్యనిర్వహణాధికారి
శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానము,
మూలాపేట, నెల్లూరు.