శ్రీ చెంగాళమ్మ హుండీ లెక్కింపు.
శ్రీ చెంగాళమ్మ హుండీ లెక్కింపు.
నెల్లూరుజిల్లా. సూళ్లూరుపేట : తెలుగు, తమిళ ఆరాధ్యదైవం శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారి హుండీలు ఈ రోజు తెరిచి లెక్కించుట జరిగినది. మూడు నెలల 20 రోజులకు గాను రూ"40,15,173 /-లు నగదు, విదేశీ కరెన్సీ:-USA డాలర్స్- 20, UAE డాలర్స్-205 , Zhong Renmin Yiahong- 1Yuhan, బంగారం:-194 గ్రాములు, వెండి:- 468 గ్రాములు ఆదాయం చేకూరినది. ఈ కార్యక్రమంలో శాసన సభ్యలు,తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు కిలివేటి సంజీవయ్య,ఆలయ చైర్మన్ దువ్వూరు బాల చంద్రారెడ్డి, మాజీ ధర్మకర్తల మండలి సభ్యులు, కర్లపూడి మదన్ మోహన్, శ్రీమతి ముంగర అమరావతి, శ్రీమతి మద్దూరు శారద, శ్రీమతి కామిరెడ్డి రేవతి, శ్రీమతి పి.సుద, దేవస్థానము అర్చకులు, సిబ్బంది, మెప్మా సభ్యులు, విశ్రాంతి బ్యాంకు ఉద్యోగులు, సమరస్థ సేవ సభ్యులు వున్నారు. గూడూరు దేవాదాయ శాఖ, ఇన్స్పెక్టర్, యం. సుధీర్ బాబు పర్యవేక్షణలో, కార్యనిర్వహణాధికారి ఆళ్ళ శ్రీనివాస రెడ్డి సమక్షంలో లెక్కింపు పూర్తి చేయుట జరిగినది.