అమ్మణ్ణికి శ్రీ అన్నపూర్ణ అలంకారం:- ఉభయకర్తలుగా కొండేపాటి గంగా ప్రసాద్, కోమలి దంపతులు

తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట:-

దసరా వేడుకల్లో భాగంగా 5వరోజు శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి కి  అన్నపూర్ణ అలంకారం చేశారు. ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి , ఈఓ ఆళ్ళ శ్రీనివాసులురెడ్డి  జ్యోతి వెలిగించి పూజలు ప్రారంభించారు.  వేదపండితులచే అలంకార పూజలు చేసి భక్తులందికీ హారతులిచ్చారు, ఈ సందర్భముగా జరిగిన కుంకుమ పూజల్లో ఉభయదాతలు పాల్గొన్నారు. అలంకార ఉభయదాతలు కొండేపాటి గంగా ప్రసాద్, కోమలి దంపతులు కాగా ఈ వేడుకల్లో మునిసిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి, మండల అధ్యక్షుడు అల్లూరు అనిల్ రెడ్డి, వైసీపీ పట్టణ అధ్యక్షుడు కళత్తూరు శేఖర్ రెడ్డి, ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు ముప్పాళ్ల చంద్ర శేఖర్ రెడ్డి,వంకా దినేష్ కుమార్ యాదవ్,మన్నెముద్దు పద్మజ, ఓలేటి బాల సత్యనారాయణ, కర్లపూడి సురేష్, బండి సునీత,మాజీ సభ్యులు గోగుల తిరుపాల్, మున్సిపల్ వైస్ చైర్మన్ చిన్ని సత్యనారాయణ, కౌన్సిలర్లు కొండూరు జనార్ధన్, మీంజూరు రామకృష్ణ మరియు జెట్టి వేణు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భముగా ఆలయ ఆవరణం లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.