రైతులకు ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య పై స్పెషల్ డ్రైవ్
రైతులకు ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య పై స్పెషల్ డ్రైవ్
బుచ్చిరెడ్డిపాలెం, మేజర్ న్యూస్: మంగళవారం బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని పంచేడు రైతు సేవా కేంద్రంలో రైతులకు ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య (ఫార్మర్ రిజిస్ట్రీ) గురించి స్పెషల్ డ్రైవ్ ను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారిని పి. సత్యవాణి మాట్లాడుతూరబీ 2024-25 సంవత్సరానికి గాను జిల్లాలో దాదాపు మూడు లక్షల 66 వేలఎకరాలలో పంటల సాగు చేయడం జరిగిందని తెలియజేశారు.ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులదగ్గర నుంచి అభ్యర్థనలు వస్తున్నాయి కనుక జాయింట్ కలెక్టర్ , కలెక్టర్, అగ్రికల్చర్, డిఎం సివిల్ సప్లయిస్, కోపరేటివ్ సొసైటీల ద్వారా గత నెల రోజుల నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సంబంధించిన ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. దాదాపు జిల్లాలో 297 రైతు సేవా కేంద్రాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కు చర్యలు తీసుకోవడం జరిగింది అని తెలియజేశారు.జిల్లాలో11లక్షల మెట్రిక్ టన్నుల పంట చేతికి రావడం జరుగుతుందన్నారు. కె ఎన్ ఎం1638, ఆర్ ఎన్ ఆర్ 15048 రకాలు ప్రధానంగాసాగుచే యడం జరిగింది అని తెలిపారు. గత సంవత్సరం ఓపెన్ మార్కెట్లో పుట్టి దాన్యం 21వేలనుంచి24వేలవరకు రేటు ఉందన్నారు. ఈ సంవత్సరం కూడా ఇలాగే రేట్లు ఉండవచ్చును అన్నారు.ధరలు తగ్గినట్లయితే రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా వారి ధాన్యాన్ని అమ్ముకోవచ్చునని తెలియజేశారు.నిర్దేశిత ప్రమాణాల ఆధారంగా రైతుల ధాన్యాన్ని దాన్ని కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేయడంజరుగుతుందని తెలియజేశారు.