నెల్లూరు, జనవరి 06, (రవికిరణాలు) : ప్రజల నుండి అందే స్పందన అర్జీలపట్ల ప్రత్యేకశ్రద్ధ వహించి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టరు ఎమ్.వి.శేషగిరిబాబు జిల్లా అధికారులను ఆదేశించారు.సోమవారం ఉదయం జిల్లా కలెక్టరు కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్ హాలులో రెండవ సంయుక్త కలెక్టరు కె.కమలకుమారి, తెలుగుగంగ ప్రత్యేక కలెక్టరు నాగేశ్వరరావు, డి.ఆర్.డి.ఎ. పి.డి. శీనా నాయక్ లతో కలసి స్పందన కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ప్రజల వినతులు, సమస్యలను కలెక్టరు ఎంతో ఓపికగా ఆలకించి, సానుకూలంగా పరిష్కరించాలని సంబంధిత అధి కారులకు సూచనలు జారీ చేశారు.అలాగే జిల్లా సంయుక్త కలెక్టరు డా. వి.వినోద్ కుమార్ కలెక్టరేట్‌లోని వీడియోకాన్ఫరెన్స్ హాలులో, జిల్లా రెవెన్యూ అధికారి మల్లికార్జున, గృహనిర్మాణ సంస్థ పి.డి. ప్రసాద్ లతో కలసి ప్రజల నుండి స్పందన అర్జీలను స్వీకరించారు.ఈ కార్యక్రమంలో డ్వామా, ఐ.సి.డి.ఎస్.పి.డి.లు జ్యోతిబసు, సుధాబారతి, సాంఘిక సంక్షేమశాఖ డి.డి. జీవ పుత్ర కుమార్, డి.టి.డబ్ల్యు.ఓ. విద్యారాణి, సమగ్రశిక్ష పి.ఓ. బ్రహ్మానంద రెడ్డి, బి.సి. సంక్షేమ అధికారి రాజేశ్వరి, మత్స్య శాఖ జె.డి. శ్రీహరి, పౌర సరఫరాల సంస్థ డి.ఎం. రోజ్ మాండ్, డి.సి.ఓ. తిరుపాల్ రెడ్డి, తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.