కరోనా అనుమానితులు కోసం ప్రత్యేక ఐసోలేషన్ వార్డు
గూడూరు : గూడూరు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎవరైనా కరోనా అనుమానిత లక్షణాలు ఉంటే వెంటనే గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డులో చేర్చవచ్చని, ఈ కరోనా లక్షణాలు ఉన్న వారికి వైద్య సేవలు అందించడానికి ప్రత్యేకంగా శిక్షణ పొందిన వైద్యుడు అందుబాటులో ఉంటాడని గూడూరు వైద్యాధికారులు వెల్లడించారు.