జిల్లాలో నీటిపారుదల సమస్యలను పరిష్కరించండి. ఇరిగేషన్‌ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడిని కలిసిన ఎంపీ వేమిరెడ్డి

కనిగిరి రిజర్వాయర్‌ అభివృద్ధి, ఇతర అంశాలపై చర్చ.




విడవలూరు మేజర్ న్యూస్.

నెల్లూరు జిల్లాలోని పలు నీటిపారుదల సమస్యలను పరిష్కరించేలా ప్రత్యేక చొరవ చూపాలని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు  వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి  రాష్ట్ర ఇరిగేషన్‌ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుని కోరారు. విజయవాడలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిమ్మల రామానాయుడుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఇరిగేషన్‌కు సంబంధించి పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ప్రధానంగా కనిగిరి రిజర్వాయర్‌ అభివృద్ధిపై ఆయనతో మాట్లాడారు. కనిగిరి రిజర్వాయర్‌ ఆధునికీకరణ ప్రాధాన్యాన్ని మంత్రికి వివరించారు. అలాగే పలు పెండింగ్‌ ప్రాజెక్టుల పనుల విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. వీటిపై సానుకూలంగా స్పందించిన మంత్రి నెల్లూరు జిల్లాలో నెలకొన్న నీటి పారుదల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు.