👉ఇప్పటివరకు పురపాలక సంఘాలలో అద్దె విలువ ఆధారముగా ఇంటి పన్నులు విధించేవారని, అయితే రాష్ట్ర ప్రభుత్వం పన్నులను వార్షిక అద్దె విలువతో కాకుండా, రిజిస్ట్రేషన్ విలువతో పన్నులు విదింపు విధానాన్ని చట్టం చేయడం చాలా బాధాకరం. 👉దీని వలన పేద,దిగువ మద్య తరగతి ప్రజలు పై అధిక మొత్తంలో పన్నులు భారం పడుతుందని అన్నారు.
👉కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా దీనిపై పునరాలోచించి రిజిస్ట్రేషన్ విలువ ఆధారిత పన్నులను  వేయకుండా వార్షిక అద్దె విలువ ఆదారంగా ఉన్నటువంటి ఇంటి పన్ను విధానాన్నే కొనసాగించాలని అన్నారు.
👉అధికార ప్రభుత్వం 18 నెలల పాలన కాలములో ధరలు పెంచడం ద్వారా ప్రజలపై 70 వేల కోట్ల రుపాయుల భారం మోపారని, మరో 1.30 లక్షల కోట్ల అప్పు చేసారని అన్నారు. 
👉ఈ రాష్ట్ర ప్రభుత్వం పౌర సదుపాయాలను పూర్తిగా గాలికి వదిలేసిందని అన్నారు. 👉పరిశుబ్రమైన త్రాగు నీరు, గాలి , పరిశుబ్రమైన వాతావరణం అందించడం ప్రభుత్వ బాద్యత అని అన్నారు.డ్రైనేజి లను ఎప్పటికప్పుడు క్లీన్ చేయించడం, మంచి నీటికి , డ్రైనేజి వ్యవస్థకు లింక్ లేకుండా చూడటం, ఎప్పటికప్పుడు వాటర్ ట్యాంక్ లను క్లీన్ చేయించడం , క్లోరినేషన్ , బ్లీచింగ్ చేయించడం ప్రభుత్వం బాద్యత.
👉కాని ప్రభుత్వం ప్రతి స్కీం ను స్కాం గా మార్చేసిందని అన్నారు. 
👉మొన్న గుంటూరు లో బ్లీచింగ్ పౌడర్ పేరుతో పనికిరాని సుద్ద, సున్నం చల్లారని, అల్లాగే ఏలూరు త్రాగు నీటి వలన ప్రజలు హాస్పిటల్ పాలయ్యరని అన్నారు.
👉గూడూరు పట్టణ మునిసిపాలిటి పరిధిలో అనేక ప్రాంతాలలో పారిశుద్యం అద్వానంగా ఉందని మురికివాడలలో, మురికి కాలువలు శుబ్రపరచక ఎక్కడి మురికి నీరు అక్కడే నిలబడి, తద్వారా దోమలు ప్రబలి ప్రజలు చాలా ఇబ్బందులు పడుచున్నారని, గతంలో గూడూరు పట్టణం నందు