మంచు ముసుగు ఉదయం వేళల్లో మంచు పరదాతో ప్రజలకు ఇబ్బందులు
మంచు ముసుగు ఉదయం వేళల్లో మంచు పరదాతో ప్రజలకు ఇబ్బందులు
జలదంకి, మేజర్ న్యూస్ :-
జలదంకి మండలం మంగళవారం ఎకువాజాము నుంచి ఉదయం 8 గంటల వరకు మంచు దుప్పట్లోనే ఉంది బారెడు పొద్దెక్కిన మంచు విడకపోవడం విశేషం ఉదయం 9 గంటల తర్వాత పూర్తిగా మంచు తెరలు తొలగి మండలంలో స్పష్టమైన వాతావరణం కనిపించింది. రోజు ఉదయాన్నే ఉన్నప్పటికీ మంగళవారం ఉదయం మాత్రం దట్టమైన మంచు పొగలు మండలాన్ని చుట్టేశాయి . తెల్లవారుజామున ప్రయాణిస్తున్న వాహనాలకు, మంచు పరద కారణంగా రోడ్డు కనిపించక కొంత ఇబ్బందులు పడ్డారు. అలాగే ఉదయం వేళల్లో పొలాలకు వెళ్లే రైతులు, వ్యాయామం కోసం నడక సాగించే ప్రజలకు కూడా ఇబ్బంది కలిగింది. అయితే మంచు పరద కారణంగా ఉదయం 8 గంటల వరకు కూడా సూర్యుడు కనిపించకపోవడం విశేషం.