షార్ కాంట్రాక్టర్ డ్రైవర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి:- సూళ్ళూరుపేట కార్మిక సమాఖ్య (సిఐటియు అనుబంధము) .

రవి కిరణాలు, తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట:-

పట్టణంలోని కార్మిక సమైక్య సంస్థ కార్యాలయం నందు ఆదివారం కార్మికులతో సమావేశం నిర్వహించారు.
 ఈ సమావేశం సిఐటియు మండలం కమిటి అధ్యక్షులు కా సాంబశివయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో షార్ కాంట్రాక్ట్ డ్రైవర్లు సమస్యలమీద చర్చించారు. మండల కమిటీ అధ్యక్షుడు సాంబశివరావు మాట్లాడుతూ షార్ లో వున్న  వంశీ కాంట్రాక్టరు (పాత కాపు) వేతనాలు సకాలములో ఇవ్వడము లేదని, పి.యఫ్ నెలల తరబడి జమ చేయడములేదని, అయినా బిల్లులు ఎలా చెల్లిస్తున్నారో తెలియడం లేదని,  పెంచిన డిఏ బకాయిలు,  బోనస్  ఓటి అరియర్స్ ఇవ్వడము లేదని, వివరాలతో కూడిన వేతన పట్టి ఇవ్వలేదన్నారు. ఈ యస్ ఐ డిడక్ట్  చేసి వైద్య సౌకర్యము కల్పించ లేదన్నారు. ఇది అనధికార రికవరీ, కాబట్టి కట్ చేసిన అమౌంటును వెంటనే కార్మికులకు వాపస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అనంతరం సిఐటియు మండల కమిటి కార్యదర్శి కా సుధాకర్ రావ్ మాట్లాడుతూ ఈ సమస్యలన్నీ సంబంధిత అధికారుల ధ్రృష్ఠికి తీసుకు వెళ్తామని, కార్మికులందరు కలిసి కట్టుగా వుండాలని, సిఐటియు వారికి అండగా వుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో షార్ కాంట్రాక్టర్ డ్రైవర్లు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.