శంఖుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతల, శేషాద్రినాయుడు
గుర్రంకొండ/అన్నమయ్య జిల్లా. జూన్ 1
వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నాడు నేడు పనులు, పల్లెలకు కొత్త రోడ్ల నిర్మాణం రెండవ విడత కార్యక్రమంలో భాగంగా బుధవారం మండలంలో ముమ్మరంగా పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి శంఖుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , ఎంపీ మిథున్ రెడ్డి మన పీలేరు నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధతో కోరిన వెంటనే భారీ ఎత్తున ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ కు నాడు నేడు పనులు, గ్రామీణ రోడ్లు మంజూరు చేసారని, రాబోయే రోజుల్లో ఇంకా పెండింగ్ ఉన్న అన్ని పనులు పూర్తి చేయిస్తానని , నియోజకవర్గ ప్రజల సమస్యలను తీర్చేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న టెలికం జిల్లా కమిటీ మెంబర్ శేషాద్రినాయుడు చెర్లోపల్లిలో ఎమ్మెల్యే కు ఘనంగా స్వాగతం పలికారు. టెలికం అడ్వైజరీ కమిటీ మెంబెర్ గా కొత్తగా ఎన్నికైన శేషాద్రినాయుడు ను ఎమ్మెల్యే సత్కరించారు. మండలంలోని తుమ్మలగొంది, నడిమిఖండ్రిగ , ఎల్లుట్ల, చెర్లోపల్లి, సంగసముద్రం, గుర్రంకొండ, తరిగొండ తదితర ప్రాంతాల్లో శంఖుస్థాపనలు చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ గంగయ్య, జడ్పీటీసీ ముక్తియర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సురేష్, ఎల్ వి రమణ, అప్పల్ల, గుణశేఖర్, తదితరులు పాల్గొన్నారు.