విజయవాడ: విజయవాడలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. దుర్గమ్మ దర్శనానికి వచ్చిన కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. కన్యకాపరమేశ్వరి సత్రంలో తల్లి, కుమారుడు విషం తాగి ఆత్మహత్య చేసుకోగా.. తండ్రి, మరో కుమారుడు కృష్ణా నదిలో దూకారు. మృతులను తెలంగాణ వాసులుగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు

మృతుల వివరాలు:-






పప్పుల సురేష్ (54)

సురేష్ భార్య శ్రీలత

కుమారులు ఆశిష్

అఖిల్ గా గుర్తింపు