రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్ గ్రామీణ జిల్లా గొర్రెకుంట మృత్యుబావి కేసుకు సంబంధించి సంచలన తీర్పు.. వరంగల్ గ్రామీణ జిల్లా గొర్రెకుంట మృత్యుబావి కేసులో నిందితుడు సంజయ్‌కుమార్ నేరం రుజువైనట్లు వెల్లడి.. 67 మంది సాక్ష్యులను విచారించిన అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి.. ఈ ఏడాది మే20న వరంగల్  గ్రామీణ జిల్లా గొర్రెకుంటలో ఘటన.. పాడుపడిన బావిలో 9 మృతదేహాలు లభ్యం.. పశ్చిమబంగా నుంచి వచ్చి.. వరంగల్​లో స్థిరపడిన మక్​సూద్ అతని కుటుంబ సభ్యులు తొమ్మిది మంది జలసమాధి..   హత్యకేసు మిస్టరీని 72 గంటల్లోనే ఛేదించిన పోలీసులు.. సంజయ్​కుమార్ అరెస్ట్.. ఒక హత్యను కప్పి పుచ్చుకోవడానికి 9 హత్యలు చేసినట్లు పోలీసులు వెల్లడి..   భోజనంలో నిద్రమాత్రలు కలిపి అపస్మారక స్థితిలో ఉండగానే అందరిని ఈడ్చుకెళ్లి బావిలో పడేసి సామూహికంగా హత్యలు.. నెల రోజుల్లోపే దర్యాప్తు పూర్తిచేసి ఛార్జ్​షీట్ దాఖలు చేసిన పోలీసులు