తడ బీవీ పాలెం తనిఖీ కేంద్రం వద్ద గంజాయి పట్టివేత

 నిందితున్ని అదుపులోకితీసుకొన్న సెబ్ అధికారులు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా:- తడ .



 తడ బీవీ పాలెం తనిఖీ కేంద్రం వద్ద ఆంధ్ర నుండి తమిళనాడు కి తరలిపోతున్న గంజాయిని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు పట్టుకున్న ఘటన శనివారం చోటు చేసుకుంది.

స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సి. ఐ. ఆర్ యు వి ఎస్ ప్రసాద్ తెలిపిన వివరాల మేరకు

జిల్లా అడిషనల్ ఎస్పీ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వారి ఆదేశాల మేరకు చేపట్టిన వాహన తనిఖీలలొ నెల్లూరు నుండి  చెన్నైకు వెళుతున్న APS  ఆర్టీసీ బస్సులో  తమిళనాడు, పాండిచ్చేరి ముత్తయి పేట ప్రాంతానికి  చెందిన ఎస్. కుమార్ అనే వ్యక్తి  నెల్లూరు రైల్వే స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి వద్ద పదివేల రూపాయల కు 1kg గంజాయిని కొనుగోలు చేసి  చెన్నై కి తరలిస్తున్నట్లు తెలిపారు. అతని వద్దనుండి నుండి 2kg  గంజాయి  స్వాధీనం చేసుకొని
నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సిఐ ఆర్ యు ఎస్ ప్రసాద్ వెల్లడించారు.

ఈ దాడుల్లో  కానిస్టేబుల్స్ డి. పోలయ్య, బి. వేణుగోపాల్  ఉన్నారు.