తడ బీవీపాలెం తనిఖీ కేంద్రం వద్ద 15 కేజీల గంజాయి పట్టివేత
తడ బీవీపాలెం తనిఖీ కేంద్రం వద్ద 15 కిలోలvగంజాయి పట్టివేత .నిందితుదు కాలేజీ విద్యార్థి ని అదుపులోకి తీసుకొన్న స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో సిఐ ఆర్ యు వి ఎస్ ప్రసాద్.
నెల్లూరు జిల్లా. తడ బీవీ పాలెం తనిఖీ కేంద్రం వద్ద ఆంధ్ర నుండి తమిళనాడు కి తరలిపోతున్న గంజాయిని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు పట్టుకున్న ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది.
స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సి ఐ ఆర్ యు వి ఎస్ ప్రసాద్ తెలిపిన వివరాల మేరకు
జిల్లా అడిషనల్ ఎస్పీ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వారి ఆదేశాల మేరకు చేపట్టిన వాహన తనిఖీలలొ బాగం నెల్లూరు నుండి చెన్నైకు వెళుతున్న తమిళనాడు ఆర్టీసీ ఏసీ బస్సులొ తమిళనాడు రాష్ట్రానికి చెందిన దిండిగల్ జిల్లా, అత్తూరు గ్రామానికి చెందిన రమణ శివ అనే విద్యార్థి నుండి 15 కేజీల గంజాయ తో పాటు నిందితుని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు రమణ శివ విశాఖపట్నం, అరకు ప్రాంతంలో లో అత్యంత మత్తు కలిగించే గంజాయిని కిలో ఐదు వేల రూపాయలకు కొనుగోలు చేసి తమిళనాడు ప్రాంతంలోని కేవలం కళాశాలలో విద్యార్థులకు 20 వేల రూపాయలకు అమ్మకాలు సాగించేవాడు గా నిందితుడు తెలిపినట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ci ప్రసాద్ వెల్లడించారు. విద్యార్థి దశ నుండి చెడు వ్యసనాలకు బానిసై గంజాయ్ కొనుగోలు అమ్మకాలకు పాల్పడుతున్న నిందితుడు ఇప్పటికే పలుమార్లు ఈ మార్గం గుండానే గంజాయిని తరలించినట్లు తమ దర్యాప్తు వెల్లడైందన్నారు. బి.వి పాలెం ఉమ్మడి తనిఖీ కేంద్రం వద్ద తాము జరిపిన వాహన తనిఖీలలో ఒక్క వారంలోనే మూడు మార్లు గంజాయి పట్టుబడడం జరిగిందన్నారు.ఈ దాడుల్లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ. ఓ. ప్రతాప్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ చెంచయ్య, , కానిస్టేబుల్స్ హరిబాబు, వేణుగోపాల్, పోలయ్య ఉన్నారు.