ఒంగోలులో లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం జగన్.


 7.97 లక్షల పొదుపు సంఘాల్లో సభ్యులైన 78.76 లక్షల మంది మహిళలకు లబ్ది.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల నాటికి వారి పేరిట ఉన్న బ్యాంకు అప్పును భరిస్తున్న ప్రభుత్వం. ఈ పథకం ద్వారా నాలుగు విడతల్లో చెల్లింపు. రెండో విడతగా ఇప్పుడు రూ.6,439.52 కోట్లు పంపిణీ. గత ఏడాది తొలి విడత డబ్బులతో కలిపి రూ.12,758 కోట్లు లబ్ధి.  పది రోజుల పాటు కొనసాగనున్న రెండో విడత కార్యక్రమం.తొలి రోజు 83 వేల సంఘాల్లోని 8.19 లక్షల మందికి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు.

నాడు బాబు మోసం..నేడు జగన్ వరం.

2014లో ఎన్నికల ముందు. ద్వారా రుణాలన్నీ మాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఏ ఒక్కరూ ద్వాక్రా రుణం చెల్లించాల్సిన అవసరం లేదని నమ్మకంగా చెప్పారు. దీంతో మహిళలు ఆ రుణాలు చెల్లించలేదు. ఆ తర్వాత ఆయన అధికారంలోకి రాగానే ఆ హామీని అమలు చేయకుండా మోసం చేశారు. దీంతో మహిళల అప్పు.. వడ్డీతో కలిపి చెల్లించలేనంతగా పెరిగిపోయింది.

 ఈ కారణంగా అప్పట్లో పొదుపు సంఘాలు పూర్తిగా ఛిన్నాభిన్నమై 'ఎ' కేటగిరీ సంఘాలు కూడా 'సి', 'డి' కేటగిరీలోకి వెళ్లిపోయాయి. పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ పథకం కింద కూడా రుణాలను ఇవ్వడాన్ని అప్పటి టీడీపీ ప్రభుత్వం నిలిపివేసింది. ఇలాంటి పరిస్థితుల్లో.. రాష్ట్రంలో పొదుపు సంఘాల వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ మేరకు వైఎస్ జగన్ 'వైఎస్సార్ ఆసరా' పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం కింద ఇవాళ రెండో విడత సొమ్మును విడుదల చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ పథకం తమకు నిజంగా వరం అని రాష్ట్రంలోని ద్వారా సంఘాల మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.