చీపురుగుంటను ఆక్రమణల చెర నుండి కాపాడండి : సిపిఐ
చీపురుగుంటను ఆక్రమణల చెర నుండి కాపాడండి : సిపిఐ
రవి కిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మే 15:- సూళ్లూరుపేట మునిసిపాలిటీ పరిధిలో గల మన్నార్ పోలూరు సమీపంలో వున్న చీపురుగుంటను అధికార పార్టీకి చెందిన కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించి వ్యాపారాలు కొనసాగిస్తున్నారని వారి బారి నుండి చీపురు గుంటను కాపాడవలసిందిగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నాయకులు కోరారు. సోమవారం ప్రజా విజ్ఞప్తుల దినం పురస్కరించుకొని సూళ్లూరుపేట ఆర్డిఓ కి సదరు విషయమై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా మన్నారు పోలూరు వద్దగల చీపురుకుంట ఆక్రమణల చెరలో చిక్కుకుందని కొంతమంది ఆక్రమణదారులు చీపురు గుంట స్థలాన్ని తమ పేర రెవెన్యూ రికార్డులలో నమోదు చేసుకున్నారని ఇప్పుడు మిగిలిన స్థలాన్ని కూడా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని రెవిన్యూ అధికారులు చొరవ తీసుకుని చీపురుగుంట కబ్జా నుండి కాపాడాలని లేని సందర్భంలో సిపిఐ ఆధ్వర్యంలో చీపురు గుంటను కాపాడుకుంటామని తెలియజేశారు . ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు నాగేంద్రబాబు రమణయ్య పట్టణ సహాయ కార్యదర్శి బాలు చెంచమ్మ ప్రభుదాస్ వెంకట కృష్ణయ్య వినోద్ తదితరులు పాల్గొన్నారు.