సత్యవేడు శాసనసభ్యులు గారూ వాస్తవాలు వక్రీకరించకండి - ఎంపీ గురుమూర్తి
సత్యవేడు శాసనసభ్యులు గారూ వాస్తవాలు వక్రీకరించకండి - ఎంపీ గురుమూర్తి
రవి కిరణాలు తిరుపతి:-
సత్యవేడు నియోజకవర్గానికి ఒక్క రూపాయి నిధులు కేటాయించలేదు అని ఆరోపించడం సత్యదూరం అని ఎంపీ గురుమూర్తి అన్నారు. గ్రామీణ నియోజకవర్గం అయిన సత్యవేడు నియోజకవర్గానికి ఎంపీ నిధుల మంజూరులో అధిక ప్రాధాన్యత ఇచ్చామని అడిగిన ప్రతి పనికి నిధులు మంజూరు చేశామని చాలా వరకు నిధులు ఆయన సిపారసు మేరకే మంజూరు చేశామని కానీ పనులు పూర్తి చేయడంలో ఆయన నిర్లక్ష్యం వహించి విఫలమయ్యారని తదుపరి పనులు మంజూరు చేసిన వారితో సమన్వయము చేసి చాలా వరకు పనులు పూర్తి చేశామని తెలియజేశారు.
ఆలా పూర్తయిన పనుల్లో సీసీ రోడ్లు, బస్సు షెల్టర్లు తోపాటుగా రూ.2 కోట్ల 8లక్షల 60 వేల రూపాయల నిధులతో 33 పనులు పూర్తయ్యాయని దాని తోపాటుగా రూ.38 లక్షల నిధులతో 3 పనులు పురోగతిలో ఉన్నాయని రూ.80 లక్షల 70 వేల రూపాయలతో 17 పనులు అనుమతుల కోసం వేచి ఉన్నాయని నాగలాపురం నుంచి చినపాండూరు రోడ్డు నిర్మాణం కొరకు రూ 1 కోటి 20 లక్షలతో పనులు మంజూరయ్యాయని ఆయన తెలిపారు. ఉప ఎన్నికలో కానీ ఇప్పుడు జరిగిన సార్వత్రిక ఎన్నికలో కానీ సత్యవేడు నియోజకవర్గం ప్రజలు నన్ను అక్కున చేర్చుకొని మంచి మెజారిటీ అందించారని ఇక మీదట కూడా సత్యవేడు నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తామని ఎల్లవేళల అందరికి అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలియజేశారు.