సర్వోదయ కళాశాల అధ్యాపకురలుకి డాక్టరేట్....
సర్వోదయ కళాశాల అధ్యాపకురలుకి డాక్టరేట్....
నెల్లూరు జిల్లా లోని శ్రీ సర్వోదయ డిగ్రీ కళాశాలలో బోటనీ లెక్చరర్ గా పనిచేస్తున్న దొంగర సంగీత గారికి బోటనీ విభాగంలో “phytochemical Screening and Antimicrobial Activity of selected Bryophytes in Andhra Pradesh” అనే అంశం పై పరిశోధనకు గాను ఆంధ్ర విశ్వ విద్యాలయం డాక్టరేట్ ప్రధానం చేసింది. ఈమెకు ఆచార్య డి. సంధ్యాదీపికగారు Research Guide గాను, ఆచార్య ఎస్ బి. పడాల్ గారు Co- Guide గా వ్యవహరించారు.
ఈ పరిశోధన తేమ, నీడ ప్రాంతాలలో పెరిగే బ్రయోఫైట్స్ అనే మొక్కల పైన నిర్వహించటం జరిగింది. ఆంధ్రప్రదేశలో తూర్పు - కనుమలలో పెరిగే కొన్ని బ్రయోఫైటా మొక్కలను ఎంచుకొని పరిశోధించగా ఇవి తీవ్రమైన వాతావరణ పరిస్థితులను, ఒత్తడిని తట్టుకో గలుగుతాయని అలాగే సీనో సెఫాలమ్ కొనికమ్ మరియు మార్కాన్నియు పామేట్ అనే మొక్కలలో ద్వితీయ జీవక్రియలలో రికార్డెన్-C అనే రసాయనంను ఉత్పత్తి చేయటం వలన వ్యతిరేకత చర్యను కలిగి ఉంటాయని పరిశోధనా పరంగా సూక్ష్మజీవులు కనుగొనడం జరిగింది. ఈ అధ్యాయనం సహజజీవ వనరులను వాణిజ్యం కోసం ఉపయోగించడానికి కొత్త మార్గాలను తెరిచింది. ప్రస్తుతకాలంలో హానికరమైన పురుగుల మందులు మరియు శిలీంధ్రనాశకాలు వాడటం వలన పర్యావరణ సమతుల్యత ప్రభావం చూపుతోంది. దీని కారణంగా ప్రజలు ఎన్నో రకాల దీర్ఘకాలిక సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారు. బ్రయోఫైటా మొక్కలలో అంటే బాక్టీరియల్, కంటీ ఫంగల్ చర్చ చూపే మూలకాల కారణంగా వీటిని హానికరమైన పురుగు మందులు, శిలీంధ్ర నాగకాలకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించటం వలన పర్యావరణము మొక్కలు, జంత రక్షకులుగా ఉపయోగపడతాయని, అదేవిధంగా వ్యాధులకు సంబంధించిన మందుల (జాషధాల ) తయారీలో ఉపయోగించవచ్చని తెలిపారు. ఈ అధ్యాయనం కోల్ట్ ఫార్మాస్యూటికల్స్ మరియు న్యూట్రాస్యూటికల్స్ అభివృద్ధి కి సహాయపడుతోందని తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టరేట్ పొందిన సంగీత గారికి శ్రీ సర్వోదయ డిగ్రీ కళాశాల ఈ ఓ మరియు
కరస్పాండెంట్ పి వి. హేమచంద్ర రావు గారు, ప్రిన్సిపాల్ వి. రవికుమార్ గారు, వైస్ ప్రిన్సిపాల్ ఎం. పిచ్చయ్య గారు, రిటైర్డ్ ప్రిన్సిపాల్ ఫిజికల్ డైరక్టర్ సురేష్ బాబు గారు, రిటైర్డ్ బోటనీ లెక్చరర్ సురేష్ బాబు గారు, లెక్చరర్స్ కే. సరోజిని గారు, రజనీ కుమారి గారు, రత్నయ్య గారు, శివకుమార్ గారు, మరియు తదితర అభినందించారు.