ఆరూరు ఉన్నత పాఠశాలలో భక్తిశ్రద్ధలతో సరస్వతి పూజ.
ఆరూరు ఉన్నత పాఠశాలలో భక్తిశ్రద్ధలతో సరస్వతి పూజ.
భార్గవి మెడికల్స్ సౌజన్యంతో విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు పంపిణీ.
రవి కిరణాలు న్యూస్
చిట్టమూరు మండలం ఆరూరు ఉన్నత పాఠశాలలో బుధవారం భక్తిశ్రద్ధలతో సరస్వతి పూజ, వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు.10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు పలుకుతూ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ విద్యార్థులు మంచి ఉత్తీర్ణత శాతం సాధించి,మెరుగైన ఫలితాలు సాధించాలన్నారు.ఫిబ్రవరి 28న సైన్స్ డే సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన క్విజ్, ఎలక్ట్రీషియన్ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు కొత్తగుంటకు చెందిన భార్గవి మెడికల్ సౌజన్యంతో బహుమతులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయులు చలపతి,బి అశోక్, ఎస్ కె భాషా,ఆర్ అశోక్,బి రమణయ్య,ఐ సురేష్,బి పుష్పలత,పి రాజేంద్ర లతో పాటు విద్యార్థులు పలువురు పాల్గొన్నారు.