ఎస్‌ఆర్‌కె స్కూల్ లో సైన్స్ అండ్ హెరిటేజ్ ఎక్స్పో
నెల్లూరు, జనవరి 23, (రవికిరణాలు) : మాగుంట లే అవుట్‌లో ఉన్న విశ్వసాయి డాక్టర్ ఎస్‌ఆర్‌కె స్కూల్ లో జనవరి 25, 26 తేదీలలో సైన్స్ అండ్ హెరిటేజ్ ఎక్స్‌పో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ ఛైర్మన్ డాక్టర్ ఎన్.సత్యనారాయణ తెలిపారు. శ్రీహరికోట, షార్ నుంచి అనేక రాక్లెట్ నమూనాలు, ఆర్యభట్ట నుంచి మార్స్ దాకా శాటిలైట్ నమూనాలు, హైద్రాబాద్ నుంచి అనేక రోబోలు, వివిధ రకాల అలరించే మొక్కలు, మానవ అవయవాలు, సజీవ జంతువులు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, గణిత శాస్త్రాలకు సంబంధించిన వర్కింగ్ మోడల్స్, స్కిల్ గేమ్స్, వివిధ రాష్ట్రాల సాంప్రదాయ రీతులు, ప్రార్ధనా స్థలాలు మొ|| ఉంటాయని డైరెక్టర్ కృష్ణ మోహన్ తెలిపారు. ఈ ఎక్స్పో పాఠశాలల, కళాశాలల విద్యార్థులకు ఎంతో ఉపమోగపడుతుందని, అందరు విద్యార్థులు, తల్లితండ్రులు, పాఠశాలల యాజమాన్యాలు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని తెలిపారు.