గ్రామీణాభివృద్ధి  గాలికి వదిలేశారు.


* పడుగుపాడు జాతీయ రహాదారిపై సెంట్రల్ లైటింగ్ సిస్టం ప్రారంభోత్సవం  సందర్భంగా  ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి





విడవలూరు మేజర్ న్యూస్.


 గత ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధిని గాలికి వదిలేసిందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. కోవూరు మండలంలోని పడుగుపాడు వద్ద నేషనల్ హైవే తో నెల్లూరు సిటీని అనుసంధానం చేసే ఫోర్ లైన్ రోడ్డు పై గల సెంట్రల్ లైటింగ్ సిస్టంను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సోమవారం రాత్రి ప్రారంభోత్సవం చేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి  గాలికి వదిలేశారని ఎక్కడా అభివృద్ధి జరిగిన దాఖలాలు కూడా లేవన్నారు. కోవూరు నియోజకవర్గంలోని ప్రతి మేజర్ పంచాయితీలో మంచి రోడ్లు డ్రైన్లు ఉండాలనేది తన ఆశయమన్నారు. గ్రామాలే దేశానికి పట్టు కొమ్మలు అనే గాంధీజి  సిద్ధాంతాన్ని ఆచరణలో పెడుతున్నామని ఇటీవల 'క్లీన్‌ కోవూరు' పేరిట విపిఆర్ ఫౌండేషన్ ద్వారా కోవూరులో చేపట్టిన మురుగు కాలువలలో పూడిక తీత కార్యక్రమాన్ని గుర్తు చేసారు. కేంద్ర, రాష్ట ప్రభుత్వాల సహకారంతో నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామానికి రోడ్లు వేయించే దిశగా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కోవూరు మండల టిడిపి అధ్యక్షులు ఇంతా మల్లారెడ్డి, టిడిపి జిల్లా కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, జెట్టి మదన్ రెడ్డి,  శ్రీనివాసులు, పెంచలయ్య, రాకీ, సూరిసెట్టి శ్రీనివాసులు రెడ్డి, కాటంరెడ్డి చంద్రారెడ్డి, ఆవుల వాసు,షేక్ ఫిరోజ్, నాజిర్ తదితరులు పాల్గొన్నారు.