ఎన్టీఆర్ పార్క్ ను సందర్శించిన రూరల్ ఎమ్మెల్యే
ఎన్టీఆర్ పార్క్ ను సందర్శించిన రూరల్ ఎమ్మెల్యే
నెల్లూరు కార్పొరేషన్ (మేజర్ న్యూస్) నెల్లూరు 19వ డివిజన్లో నందమూరి తారక రామారావు పార్క్ ను నుడా మరియు కార్పొరేషన్ అధికారులతో కలిసి శుక్రవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు 19వ డివిజన్ టిడిపి ఇన్చార్జ్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే మాట్లాడుతూ 2014లో అప్పటి మంత్రివర్యులు పొంగురు నారాయణ, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మరియు మేయర్ అబ్దుల్ అజీజ్ చొరవతో ఈ పార్క నిర్మాణానికి శ్రీకారం చుట్టారని తెలియజేశారు. 2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ పార్కులో కొంతమేర పనులు చేయించిన అవి ప్రజలకు ఉపయోగపడలేదన్నారు. అదేవిధంగా తాను మూడోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత నుడా మరియు కార్పొరేషన్ అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడి ఈ పార్కును ప్రజలకు అందుబాటులోకి తేవాలని, కనీసపాటి పనులు పూర్తి చేయించి ఈ ప్రాంత వాసుల చిరకాల కోరిక తీరే విధంగా మరో వారం రోజుల్లో నందమూరి తారక రామారావు పార్కును ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.