నేటి ఉదయం శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. అనంతరం విలేకరులతో  మాట్లాడుతూ....
 అధికార బలం ఉందని గర్వంతో గ్రామ జాతరను అడ్డుకోవడం ఏం పద్ధతని ఆయన ప్రశ్నించారు. తన రెండు చేతులను కట్టివేశారని మూగ చాటింపుకు వచ్చిన వ్యక్తికి కార్యక్రమం రద్దు అయిందని వెళ్లిపోవాలని దేవాదాయ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారన్నారు. ఎంపీ ఆదాల, ఆనం విజయకుమార్ రెడ్డి ఒత్తిడితోనే అధికారులు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. జాతర జరగడం సింహపురి వాసులకు ఎంతో అవసరం. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.   గ్రామ అరిష్టం నుంచి తప్పించుకోవాలంటే జాతర చేయాలని ఆధ్యాత్మిక గురువులు సూచించారు. నాపై కోపంతో జాతరను అడ్డుకోవాలనుకోవడం దారుణం. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.  రాజకీయాలకు, జాతరకు ముడి పెట్టడం సమంజసం కాదు. అమ్మవారి జాతరను నిలిపి వేయకుండా మీరే జాతరను చేసుకోండి. నేను సామాన్య భక్తుడిలా వచ్చి అమ్మవారి ని దర్శనం చేసుకుంటా. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.   రాజకీయాలకు ఇలాంటి కార్యక్రమాలకు ముడిపెట్టి ఇబ్బందులకు గురి చేయకూడదు. ఎలాగో మార్చిలో జాతర చేయలేకున్నాం... తర్వాత అయినా మీరే నిర్ణయం తీసుకొని జాతర జరిపించండి. అధికార మదంతో జాతరని ఆపేయాలనుకోవడం దారుణం. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.  రాత్రి నుంచి వాట్సప్ లో శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం కార్య నిర్వహణ అధికారి ప్రసాద్ జాతరకు సంబంధించి అనుమతి లేదంటూ పోస్టింగులు పెడుతున్నారని ఆదాల ప్రభాకర్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి కనుసనల్లోనే ఈ వ్యవహారం అంతా సాగిందని ఆయన పేర్కొన్నారు. ఇక విధిలేని పరిస్థితుల్లో అధికార బలానికి తొలొగ్గి వెను తిరుగుతున్నామన్నారు. శ్రీ ఇరుకళల పరమేశ్వరమ్మ తనకు శక్తి ఇచ్చిన రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో గర్వంగా చెప్పుకునే విధంగా గ్రామ జాతరను జరిపిస్తా. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.