పొదలకూరు రోడ్డు పనుల జాప్యంపై రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆగ్రహం




 24 గంటల్లో వెంటనే ప్రారంభించాలని ఆదేశాలు

నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పొదలకూరు రోడ్ పనుల్లో జాప్యం జరుగుతుండడంతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆర్ అండ్ బి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పొదలకూరు రోడ్డు నిర్మాణ పనులు ఆలస్యం అవుతుండడంతో పలువురు స్థానికులు ఈ విషయాన్ని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్లారు.

వెంటనే రూరల్ ఎమ్మెల్యే ఆర్ అండ్ బి అధికారులకు ఫోన్ చేసి 24 గంటల లోపల రహదారి నిర్మాణ పనులు ప్రారంభం కావాలని లేకుంటే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాణ్యతా ప్రమాణాలకనుగుణంగా పనులు ఉండాలని అధికారులకు సూచించారు.