ఆత్మకూరు నియోజకవర్గంలోని 59 గ్రామ సచివాలయాలు, 47 ఆర్ బీకే భవనాల నిర్మాణ పనుల ప్రగతిపై సమీక్ష
 
పనులు జరుగుతున్న తీరుపై, నివేదికలు తీసుకుని  ఇక నిత్యం పరిశీలిస్తా

సిమెంట్ సహా త్వరితగతిన ప్రభుత్వ భవన నిర్మాణాల పూర్తికి ఏ ముడిసరకు కావాలన్నా తెప్పిస్తాం

గ్రామ సచివాలయాల నిర్మాణానికి సంబంధించిన బిల్లులను ఎప్పటికప్పుడు జాప్యం లేకుండా పంపాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశం

పునాదులు, స్లాబ్ ల వంటి పనులు ఏవేవి ఎంతవరకూ వచ్చాయో సమీక్షించిన మంత్రి గౌతమ్ రెడ్డి

పనులు ఎలా జరుగుతున్నాయో అడిగితే  ఇంజనీరింగ్ అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవడంపై మంత్రి అసంతృప్తి

పనులెలా జరుగుతున్నాయని ఏ గ్రామానికైనా ఎప్పుడైనా స్థానికులెవరినైనా అడిగి స్వయంగా వివరాలు తెలుసుకుంటా

ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను వాట్సాప్ గ్రూపుగా చేసి పనుల పరిస్థితిని తెలుసుకుంటానన్న మంత్రి

గ్రామ సచివాలయాలు, ఆర్ బీకేలు, జలజీవన్ మిషన్ లకు ప్రత్యేక గ్రూపులు ఏర్పాటు చేయాలని ఆదేశం

జల జీవన్ మిషన్ పనులు డిసెంబర్ 25 న ప్రారంభమయ్యే నాటి నుంచి పర్యవేక్షణ

నాణ్యమైన కాంట్రాక్టర్లను ఎంపికతోనే సగం పని సులువవుతుంది

జల జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి సురక్షిత నీరు అందించే కుళాయిల ఏర్పాటుపై మంత్రి ఆరా