మాట్లాడుతున్న రెవెన్యూ శాఖ అధికారులు. రైతులకు నోటీసులు ఇచ్చి సమగ్రంగా సర్వే.
మాట్లాడుతున్న రెవెన్యూ శాఖ అధికారులు. రైతులకు నోటీసులు ఇచ్చి సమగ్రంగా సర్వే.
ముత్తుకూరు, ఫిబ్రవరి 10 (మేజర్ న్యూస్) పైనంపురం రెవెన్యూ పరిధిలో రైతులకు సంబంధించిన భూములను రీ సర్వే చేసే ప్రక్రియలో ప్రభుత్వం ఆదేశాల మేరకు రైతులకు మొదట నోటీసులు ఇచ్చి వారు చూపించిన విధంగా హద్దుల ప్రకారం సర్వే చేస్తామని రెవెన్యూ శాఖ అధికారులు తెలియజేశారు. సోమవారం ముసునూరు వారి పాలెం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద రీసర్వేపై గ్రామ సభ జరిగింది. స్థానిక సర్పంచ్ జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. అదే విధంగా మండల సర్వేయర్ అనురూప్ , సర్వే డిప్యూటీ తాసిల్దారు శ్రీనివాసులు, గ్రామ రెవెన్యూ అధికారులు రైతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులకు అవగాహన కల్పించారు. రైతులకు సంబంధించిన కొన్ని విషయాలు పైన అధికారులు అర్జీలు తీసుకున్నారు. 12 బ్లాక్లుగా విభజించి సర్వే చేస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులు అధికారులకు సహకారం ఇవ్వాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు