గొల్లకందుకూరు గ్రామంలో రెవెన్యూ సదస్సు కార్యక్రమం
గొల్లకందుకూరు గ్రామంలో రెవెన్యూ సదస్సు కార్యక్రమం
నెల్లూరు రూరల్ (మేజర్ న్యూస్ )
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని గొల్లకందుకూరు గ్రామంలో రెవెన్యూ సదస్సు కార్యక్రమం లో టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ...రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి, రెవెన్యూ శాఖలో ఆన్ లైన్ ట్యాంపరింగ్, రికార్డుల తారుమారుపై అధికారులు గ్రామస్థాయిలో ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరిస్తారని తెలియజేశారు. గత వై.సి.పి. ప్రభుత్వ పాలనలో రెవెన్యూ పరంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు, గ్రామస్థాయిలో జరిగే రెవెన్యూ సదస్సుల్లో రెవెన్యూ అధికారులు పాల్గొని, సమస్యలకు పరిష్కారం చేస్తారని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ మండల రెవెన్యూ అధికారి లాజరస్, గొల్లకందుకూరు సర్పంచ్ దొరసానమ్మ, సజ్జాపురం సర్పంచ్ నారాయణ, ఉప సర్పంచ్ సూరేపల్లి కొండయ్య టిడిపి నాయకులు శివా రెడ్డి, దయాకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, సిద్దారెడ్డి శ్రీనివాసులు రెడ్డి, వేమయ్య, తొడేటి మురళి, నారాయణ, చింతగింజల శ్రీనివాసులు, బుజ్జి రెడ్డి, మహేంద్ర, అశోక్, గుడి మస్తానయ్య, వెంకటేశ్వర్లు, పెంచలయ్య, నరేష్, అయ్యప్ప, రాముడు, దినేష్, టి .ప్రసాద్, వెంకటేష్, బి.సుధాకర్, ప్రసాద్, నరసయ్య, పాశం గోపాలయ్య, యరగల క్రిష్టయ్య, హజరత్తయ్య, పెంచలయ్య, పోలయ్య, తిరుపతయ్య మరియు రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.