రీ సర్వేలో వచ్చిన భూ సమస్యలను పరిష్కరించుకోండి తాసిల్దార్ స్ఫూర్తి రెడ్డి
రీ సర్వేలో వచ్చిన భూ సమస్యలను పరిష్కరించుకోండి తాసిల్దార్ స్ఫూర్తి రెడ్డి
కొడవలూరు మేజర్ న్యూస్...
కొడవలూరు మండలం కొడవలూరు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీ సర్వేలో వచ్చిన భూ సమస్యలపై గ్రామసభ నిర్వహించడం జరుగుతుందని 16 రెవెన్యూ గ్రామాల్లో రి సర్వే గ్రామసభ పూర్తి చేయడం జరిగిందని మా పరిధిలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని మా పరిధిలో లేనటువంటి సమస్యలు పై అధికారులు దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించడం జరుగుతుందని మండల రెవెన్యూ అధికారి స్ఫూర్తి రెడ్డి తెలియజేశారు ఈ కార్యక్రమంలో రైతులు తువ్వరప్రవీణ్ మాట్లాడుతూ కొడవలూరు గ్రామానికి సంబంధించిన 380/A 380 /B సర్వే నంబర్లలో మేరీ సువర్ణ కుమారి ఆక్రమించిన 5 ఎకరాల 15 సెంట్లు హోమ్ కి సంబంధించిన స్థలం ఉందని అదేవిధంగా వైఎస్ఆర్సిపి నాయకులు ఆక్రమించిన 3. 35 సెంట్లు ఈ మొత్తం ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకొని పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మండల తాసిల్దారు గారికి వినతి పత్రం సమర్పించడం జరిగిందని తెలియజేశారు 3 ఎకరాల 15 సెంట్లు గురించి పోసిం రెడ్డి సునీల్ కుమార్ రెడ్డిని వివరణ అడగగా ఆ యొక్క భూమిని 35 సంవత్సరాల క్రితం మేము కొనుగోలు చేసి కోవూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్టర్ చేసుకున్నామని ఆ భూములకు సంబంధించిన శిస్తులు వగైరాలు మేమే చెల్లించుకుంటున్నామని ఆ భూమి మేము కొనేటప్పుడు పట్టాగా రికార్డులలో నమోదు చేయబడి ఉందని పాసుబుక్కులు అడంగల్ మా పేరు మీదే ఉన్నాయని ఈ విషయం జాయింట్ కలెక్టర్ రెవిన్యూ కోర్టు పరిధిలో విచారణకు హాజరయ్యామని గతంలో రెవెన్యూ అధికారులు చేసిన అవకతవకల వల్ల రైతులు ఎన్నో ఇబ్బందులకి గురి అవుతూ కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు ఈ విషయము పై మండల తాసిల్దారిని అడుగుగా ఈ భూమికి సంబంధించి జాయింట్ కలెక్టర్ రెవిన్యూ కోర్టు పరిధిలో ఉందని జాయింట్ కలెక్టర్ తీసుకునే నిర్ణయాన్ని బట్టి మేము ముందుకు వెళ్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కొడవలూరు మండల రైతులు పాల్గొన్నారు