వార్డు సచివాలయ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ వెంటనే చెయ్యాలి* *సచివాలయ ఉద్యోగుల నిరసన
వార్డు సచివాలయ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ వెంటనే చెయ్యాలి* *సచివాలయ ఉద్యోగుల నిరసన
చిట్టమూరు మండలం సచివాలయ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ వెంటనే చేయాలి సచివాలయ ఉద్యోగుల నిరసన
గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కొరకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి 1.34 లక్షల మందిని ఉద్యోగులుగా నియమించినందుకు ఆయనకు కృతజ్ఞతలుతెలుపుకుంటున్నాము. ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులకు 15 వేల రూపాయలు consolidate పేమెంట్ రూపంలో అందిస్తున్నారు. ఎవరైతే డిపార్ట్మెంటల్ పరీక్షలు ఉత్తీర్ణులై, రెండు సంవత్సరాల సర్వీస్ కలిగి ఉంటారో వారందరికీ పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ పే స్కేల్ అమలు చేస్తానని హామీ ఇచ్చారు.
కానీ రెండు సంవత్సరాలు గడిచి నాలుగు నెలలైనా ఆ ప్రక్రియ పూర్తి కాలేదు మళ్లీ 2022 జూన్ 30 నచేస్తామని చెప్పగా, సచివాలయ ఉద్యోగులు అందరూ తీవ్ర నిరాశలో ఉన్నాం. 15 వేల రూపాయల చాలీచాలని జీతంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం. ప్రభుత్వ పథకాలైన అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, కాపు నేస్తం, వైయస్సార్ చేయూత, వైయస్సార్ పెన్షన్ కానుక లాంటి ప్రభుత్వ పథకాలకు మా కుటుంబ సభ్యులను అనర్హులుగా ప్రకటించారు, మాకు వచ్చే 15 వేల జీతం లో సగం జీతం బండి పెట్రోల్ ఖర్చులకు పోతుంది మిగిలిన జీతంతోజీవనం చాలా కష్టంగా మారింది. దయచేసి వీలైనంత తొందరలో మమ్మల్నందర్నీ శాశ్వత ఉద్యోగులుగా గుర్తించి పే స్కేల్ అమలు చేస్తారని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం.
బతకలేక మేము పని చేస్తున్నాం ఇదే అదునుగా మమ్మల్ని ఆడుకుంటే ఎలా మండల హెడ్ ఆఫీసర్లకు అర్జీలను అందజేసిన చిట్టమూరు మండలం సచివాలయ సిబ్బంది