ఈ పంట నమోదు తప్పనిసరి.

- వ్యవసాయ అధికారి వెంకట కృష్ణయ్య.




విడవలూరు మేజర్ న్యూస్.


ప్రతి రైతు తాము వేసిన పంటకు సంబంధించి ఈ పంట నమోదు చేయించుకోవాలని మండల వ్యవసాయాధికారి వెంకట కృష్ణయ్య కోరారు. ఈ పంట నమోదు కార్యక్రమం పై శుక్రవారం మండలంలోని వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులకు ఒకరోజు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విస్తరణ అధికారులు మండలంలోని ప్రతి రైతు వద్దకు వెళ్లి ఈ పంట నమోదును తప్పనిసరిగా చేయాలని ఆదేశించారు. అదేవిధంగా ఈ పంట నమోదు విషయంలో కూడా రైతులు సహకరించాలని ఈ పంట నమోదును తప్పనిసరిగా చేయించుకోవాలని కోరారు. పంట రుణాలు కావాలన్నా, పంట నష్టపరిహారం పొందాలన్న, వివిధ ప్రభుత్వ పథకాలు అందాలన్న, తప్పనిసరిగా ఈ పంట నమోదు ఉండాలని కోరారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రతి రైతు కూడా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు పాల్గొన్నారు.