నాలుగేళ్ల చిన్నారి అరుదైన రికార్డ్
నాలుగేళ్ల చిన్నారి అరుదైన రికార్డ్
పిట్ట కొంచెం.. కూత ఘనం అనే నానుడి ఇలాంటి వారిని చూసే వచ్చిందేమో అనిపిస్తోంది ఎంతో కష్టపడితే గానీ రికార్డులు సొంతం కావు.. కానీ నాలుగేళ్ల పసిప్రాయంలోనే ఓ చిన్నారి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సాధించింది చిన్నారి యోగాశ్రితను అభినందించిన తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత, నారా చంద్రబాబు నాయుడు
ఇంతకు ఆ పాప ఏం చేసిందంటే..
గుంటూరు జిల్లా నకరికల్లు మండలం "కుంకలగుంట" కు చెందిన చిన్నారి కనుమూరి బాజీ చౌదరి కుమార్తె యోగాశ్రిత అరుదైన రికార్డు సాధించింది నాలుగేళ్ల పసిప్రాయంలోనే 33 నదుల పేర్లు తక్కువ సమయంలో చెప్పి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ లో స్థానం దక్కించుకుంది అరుదైన ఘనత సాధించిన చిన్నారి యోగాశ్రితను తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అభినందించారు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆశీర్వదించారు