బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయితీలో మరుగు కాలువలు,గుంటలలో ఆయిల్ బాల్స్ వేసే కార్యక్రమానికి రామకృష్ణ నగర్ నుండి శ్రీకారం
బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయితీలో మరుగు కాలువలు,గుంటలలో ఆయిల్ బాల్స్ వేసే కార్యక్రమానికి రామకృష్ణ నగర్ నుండి శ్రీకారం చుట్టిన ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజామురళీ,కమీషనర్-శ్రీనివాస్ రావు,కౌన్సిలర్లు-ప్రసాద్,అనంతమ్మ,షకీల బేగం,నాయకులు మురళి,డా॥అల్లాభక్షు.
ఛైర్ పర్సన్ సుప్రజామురళీ మాట్లాడుతూ,
1.బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయితీలోని ప్రజల ఆరోగ్యమే ప్రధాన లక్ష్యంగా ఎప్పటి కప్పుడు శానిటేషన్ చేస్తూ మనఎ మ్మెల్యే శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి సహకారంతో కౌన్సిల్ మరుగు కాలువలు, గుంటలలో ఈరోజు నుండి ఆయిల్ బాల్స్ వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము.
2.ఈ ఆయిల్ బాల్స్ వేయడం ద్వారా మరుగు నీటిపై ఆయిల్ తెట్ట పలుచగా పరుచుకుని దోమలు నివారణ మరియు లార్వాలు చనిపోయి దోమలు ఉత్పత్తిని నివారించవచ్చును.
3.దోమల నివారణకు బుచ్చిటౌన్లో ఇంతకు ముందు చాలా కార్యక్రమాలు చేపట్టాము. ప్రజలు కూడా మీ ఇంటి ఆవరణములోని కూలర్లు,తొట్టెలతో పాటు గుంతల్లో నీరు నిల్వకుండాచూడాలని విజ్ఞప్తి చేస్తున్నాను
4.ప్రజలు చెత్తను కూడా ప్రభుత్వం మీకు ఇచ్చిన 3-రకాలు డస్ట్ బిన్లలోనే చెత్తవేసి పారిశుద్ధ్య కార్మికులకు అందించాలని నా మనవి.తద్వారా డెంగ్యూ & మలేరియా లాంటి అన్ని రకాల సీజనల్ వ్యాధులను నివారించవచ్చునని తెలిపారు.