జగనన్న సురక్ష క్యాంపు ఏర్పార్టును పరిశీలించిన ఆర్డీవో చంద్రముని

 రవికిరణాలు ప్రతినిధి - దొరవారిసత్రం  న్యూస్:- రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సురక్ష పథకం క్యాంప్ ఏర్పాటను సూళ్లూరుపేట ఆర్డీవో చంద్రముని పరిశీలించారు ఆయన శుక్రవారం నెలబల్లి సచివాలయం పరిధిలో ఏర్పాటు చేస్తున్న సురక్ష క్యాంప్ ను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై 1వ తేదీన అనగా శనివారం జరుగునున్న సురక్ష క్యాంపు అర్హులైన ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా చర్యలు చేపట్టాలి వివిధ రకాలైన సర్టిఫికెట్లు కొరకు వచ్చిన వారికి పరిశీలించి అర్హత కలిగి ఉంటే వారికి సర్టిఫికెట్లను మంజూరు చేయాలని అధికారులకు సూచించారు ఇప్పటికే గ్రామ వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి సురక్ష పథకంపై ప్రజలకు అవగాహన కలిగించి అర్హత కలిగిన అర్హులను గుర్తించి ఉన్నారు రేపు అనగా శనివారం జరగబోవు ఈ సురక్ష క్యాంపులో ఎలాంటి సమస్యలు ఎదురవకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ సురక్ష పథకం అందాలని ఆయన అధికారులకు తెలిపారు ఈయన తోపాటు తాసిల్దార్ గోపిరెడ్డి ఎంపీడీవో సింగయ్య