వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడమంటే రైతులను అవమానించడమే
వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడమంటే రైతులను అవమానించడమే
మీటర్ల కంపెనీల వద్ద కమీషన్లు, కేంద్రం వద్ద అదనపు అప్పుల కోసమే మీటర్లపై ఏపీ ప్రభుత్వ పెద్దల ప్రత్యేక ఆసక్తి
ఎట్టి పరిస్థితుల్లో మోటార్లకు మీటర్లను ఒప్పుకోం...రైతులతో కలిసి ఉద్యమిస్తాం..ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటాం
నెల్లూరులో మీడియాతో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
ఏపీలో 18 లక్షల వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేస్తామని మంత్రి పెద్దిరెడ్డి సెలవిచ్చారు
శ్రీకాకుళంలో ట్రయల్ రన్ గా మీటర్లు పెడితే 30 శాతం విద్యుత్ ఆదా అయిందని, అందుకని అంతా పెట్టేస్తామంటున్నారు
మీటర్లు పెడితే 30 శాతం ఆదా అయిందంటే, ఆ విద్యుత్ ను రైతులు దొంగతనం చేస్తున్నారని ప్రభుత్వం భావిస్తుందా
మీటరు పెడితే కరెంటు తక్కువ కాలేది..పెట్టకపోతే ఎక్కువ కాలేది...అసలు ఆ టెక్నాలజీ ఏంటో
అంతగా అవసరం అనుకుంటే అక్రమ కనెక్షన్లు తొలగించడంతో పాటు ట్రాన్స్ ఫార్మర్లకు మీటర్లు పెట్టి ఆదా చేసుకోండి
దేశమంతా మోటార్లు పెట్టాలని భావించినా రైతుల తిరుగుబాటుతో నరేంద్ర మోదీ లాంటి మొండి మనిషే వెనక్కి తగ్గారు
కేవలం అప్పుల కోసం ఎఫ్.ఆర్.బీ.ఎం రేటింగ్ పెంచుకోవడం కోసమే ఏపీలో ప్రభుత్వం రైతుల గొంతు కోస్తోంది
రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షల మీటర్ల కోసం రూ.4,500 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఆ డబ్బులో కమీషన్ల కోసం కూడా ప్రభుత్వ పెద్దలు మీటర్లపై ఆసక్తి చూపుతున్నారు
గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయానికి 9 గంటలు ఇస్తుంటే తాను అధికారంలోకి వస్తే 12 గంటలు ఇస్తానని జగన్ రెడ్డి హామీ ఇచ్చారు
అధికారంలోకి రాగానే 9 గంటలను 7 గంటలకు తగ్గించారు. అందులోనూ ఆరేడు సార్లు కోతలే
ఒక్క వ్యవసాయానికే కాదు..పరిశ్రమలు, ఇళ్లకు కూడా సక్రమంగా విద్యుత్ సరఫరా చేయడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైంది
వ్యవసాయానికి 12 గంటలు ఇస్తామన్న కరెంటును 7 గంటలకు తగ్గించడం ద్వారా ఈ ప్రభుత్వం ఇప్పటికే 42 శాతం విద్యుత్ ను దొంగచాటుగా ఆదా చేసుకుంటోంది.
శ్రీకాకుళంలో 30 శాతం ఆదా అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ అమాయకుడై ఆ రాష్ట్రంలో మీటర్లు పెట్టడం లేదా
తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టబోమని స్పష్టం చేశారు..దేశంలోని సగం రాష్ట్రాలు అదే నిర్ణయంతో ఉన్నాయి
దేశవ్యాప్తంగా వస్తున్న ఒత్తిడితో కేంద్ర కేబినెట్ కూడా మీటర్ల విషయంలో వెనక్కి తగ్గింది
ఏపీలో మాత్రం మీటర్లు పెట్టేది పెట్టేదే అనడం వైసీపీ నియంతృత్వ పోకడలకు నిదర్శనం
మోటార్లకు మీటర్లు బిగించగానే రైతులు బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేయాలంట..అందులో ప్రభుత్వం డబ్బు వేస్తుందంట..ఆ డబ్బుతో కరెంట్ బిల్లు కట్టాలంట
రాష్ట్రంలో రైతులపై జగన్ రెడ్డి ప్రభుత్వం కక్షకట్టింది. వీరి నిర్ణయాలతో ఇప్పటికే వ్యవసాయ రంగం కుదేలైపోయింది
రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసి ఆరేడు నెలలకు కూడా డబ్బు కట్టడం లేదు..వీళ్లు మళ్లీ కరెంట్ బిల్లులకు డబ్బులు వేస్తారంట
అన్నదాతల విషయంలో రైతు వ్యతిరేక వైసీపీ ప్రభుత్వం తప్పుడు ప్రకటనలు చేస్తోంది..అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు చెప్పారు
మూడేళ్లలో ధాన్యం కొనుగోలు చేసి రైతులకు ఇచ్చిన డబ్బును కూడా ఉచితంగా ఇచ్చినట్టు ప్రకటించుకోవడం సిగ్గుచేటు
రాష్ట్రంలోని రైతులందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున విన్నవిస్తున్నాం...ఏ ఒక్కరు మీటరు పెట్టడానికి అంగీకరించవద్దు..బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వొద్దు..మీకు అండగా మేముంటాం..తాడోపేడో తేల్చుకుందాం