చెంగాళ్లమ్మ ఆలయంలో పుష్పయాగం.
చెంగాళ్లమ్మ ఆలయంలో పుష్పయాగం.
రవి కిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట :-
కాళ్లంగి నది ఒడ్డున వెలసి ఉన్న తెలుగు, తమిళ ఆరాధ్యదైవం శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానము నందు “శ్రావణమాసం చివరి శుక్రవారం’’ సందర్భముగా శ్రీ అమ్మవారికి “పుష్పయాగం’’ ఆలయ కార్యనిర్వహణాధికారి, సిహెచ్.శ్రీనివాసబాబు పర్యవేక్షలో అత్యంత వైభవముగా నిర్వహించుట జరిగినది. చెన్నై కి చెందిన నంబూరు మోహన్ రావు శ్రీమతి సులోచనమ్మ మరియు నంబూరు మనోజ్ సాయి శ్రీమతి లత ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమమములో శాసన సభ్యులు, డాక్టర్ నెలవల విజయశ్రీ , మాజీ ఛైర్మన్ దువ్వూరు బాలచంద్రా రెడ్డి, మాజీ ధర్మకర్తల మండలి సభ్యులు మన్నెముద్దు పద్మజ, ఓలేటి బాల సత్యనారాయణ, మద్దూరు శారద మరియు కళత్తూరు రామ్మోహన్ రెడ్డి, టిడిపి పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్, భక్తులు పాల్గొన్నారు.