నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ప్రభుత్వం పోలియో చుక్కల కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేపడుతుంది.ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి పని చేస్తున్నారు.గతంలో మహానేత
రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో పేద వారికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలని "ఆరోగ్యశ్రీ" కార్డులను తీసుకుని వచ్చారు.ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు "ఆరోగ్యశ్రీ" కార్డుల నుంచి వివిధ రకాల వ్యాధులను తొలగించి, "ఆరోగ్యశ్రీ"ని నిర్వీర్యం చేశాయి.గతంలో చంద్రబాబు "ఆరోగ్యశ్రీ" కార్డులకు అర్హత ఉన్న హాస్పిటల్స్ కు బిల్లులు చెల్లించని పరిస్థితి.
జగన్మోహన్ రెడ్డి "ఆరోగ్యశ్రీ" కి పూర్వ వైభవం తీసుకుని వచ్చే విధంగా కార్డులు పంపిణీ చేస్తున్నారు. 2089 వ్యాధులకు "ఆరోగ్యశ్రీ" కార్డుల కింద మన రాష్ట్రంలోనే కాకుండా, ఇతర రాష్ట్రాల్లో కూడా వైద్యం చేయించుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారు.వైద్యులు, సిబ్బంది కూడా అంకిత భావంతో పనిచేస్తూ పోలియో చుక్కలు వేస్తున్నారు.ఈ ప్రభుత్వం ఆరోగ్య వంతమైన సమాజాన్ని నిర్మించే విధంగా ముందుకు పోతుంది. ఈ పల్స్ పోలియో 100 శాతం వేసే విధంగా అధికారులు పని చేయాలి.వాలంటీర్లకు సెల్ ఫోన్స్ అందించే కార్యక్రమం చేపట్టడం సంతోషం.గత ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థలా కాకుండా జన్మభూమి కమిటీలు పెట్టి అర్హులైన వారికి ఏమి ఇవ్వని పరిస్థితి.కానీ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల వ్యవస్థను తీసుకొని వచ్చి అర్హులైన వారికి సంక్షేమ పథకాలు ఇంటి వద్దకే అందివ్వడం జరుగుతుంది.వాలంటీర్లు అంకిత భావంతో పనిచేస్తూ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు తీసుకొని రావాలి.