పొదలకూరు బాలుర ఉన్నత పాఠశాలకు పారితోషకం అందజేసిన.
పొదలకూరు బాలుర ఉన్నత పాఠశాలకు పారితోషకం అందజేసిన.
రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయులు ఏవి సుధాకర్.
పొదలకూరు మేజర్ న్యూస్.
2024 సంవత్సరానికి గాను రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత గా ఎంపికైన ఏవి సుధాకర్ గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తిదాయక సందేశంతో తనకు ప్రభుత్వం వారు అందజేసిన 20 వేల రూపాయల చెక్కును మరియు తన సొంత నిధి నుండి పదివేల రూపాయలను కలిపి మొత్తం 30 వేల రూపాయలను ఈరోజు వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని గౌరవ మాజీ మంత్రివర్యులు ,సర్వేపల్లి శాసనసభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా విద్యా కమిటీ చైర్మన్ మరియు ప్రధానోపాధ్యాయుల వారికి అందజేయడం జరిగింది ..ఈ సందర్భంగా ఏవి సుధాకర్ మాట్లాడుతూ తన తల్లి అత్తివరం వెంకమ్మ గారి జ్ఞాపకార్థం ఈ 30 వేల రూపాయల శాశ్వత నిధికి వచ్చే వడ్డీతో సుమారు( 2000 రూపాయలు) బాలుర ఉన్నత పాఠశాలలో పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థికి ప్రతి ఏడాది ఆగస్టు 15వ తేదీన నగదు ప్రోత్సాహకాన్ని అందజేయనున్నట్లు తెలిపారు .పారితోషకం అందించడం పట్ల శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సుధాకర్ ను అభినందించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత బోగోలు భాస్కర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు సనత్ కుమార్, విద్యా కమిటీ చైర్మన్ ధనలక్ష్మి ,వైస్ చైర్మన్ హసీనా, ఉపాధ్యాయులు రాజ్ కుమార్, కమిటీ సభ్యులు శ్రీనివాసులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.