గంభూషియా చేపలతో దోమల ఉత్పత్తికి కట్టడి :- డాక్టర్ చైతన్య

రవికిరణాలు ప్రతినిధి -దొరవారిసత్రం  :

పలు రకాల దోమల ద్వారా ప్రజలకు సంభవిస్తున్న వ్యాధులైనమలేరియా,డెంగ్యూ, వ్యాధుల కట్టడికి, దోమల లార్వాల నిర్మూలనకు గంభూషియా చేపలు ఎంతో ఉపయోగపడతాయని దొరవారిసత్రం వైద్యాధికారి చైతన్య అన్నారు. శుక్రవారం సూళ్లూరుపేట మలేరియా సబ్ యూనిట్ అధికారి రమేష్ తెచ్చిన గంభూషి యా చేప పిల్లలను దొరవారిసత్ర కేంద్రంలో ఉన్న నీటి కోనేరులో విడవడం జరిగింది. ఈ చాప పిల్లలు నిల్వ ఉన్న నీటిలో దోమల ద్వారా ఉత్పత్తి అయిన లార్వాలను ఆహారంగా తీసుకోవడంతో లార్వా దోమగా మారకముందే వాటిని ఆహారంగా సేవించడంతో ఎన్నో వేల రకాల దోమలను నియంత్రించే అవకాశం ఉంటుందని మలేరియా సభ్యులు అధికారి అంటున్నారు. రసాయనాలు పిచికారి చేసి దోమలని కట్టడి చేయడం ఒక విధానం అయితే, గంబుషియా చేపల ద్వారా  దోమల ఉత్పత్తిని అరికట్టే విధానం మరొకటని అన్నారు. మండల కేంద్రంలోనికోనేరు, ఏ కొల్లు గ్రామంలోని పెద్ద నేల బావి, నేలపట్టు గ్రామంలో కుక్కల గుంట చెరువు, ఎన్ ఎం అగ్రహారం లోని  కోనేరు, ముత్తరాజపాలెంలో  ఉన్న బావిలో కూడా ఈ చేపలను విడవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆయా సచివాలయ పరిధిలోని ఆరోగ్య సిబ్బందిఇ, సుధాకర్, ఎం ఎల్ హెచ్ పి  మౌనిక, ఏ ఎన్ ఎం డోర తి, శ్రావణి, ఆశ కార్యకర్తలు  మంజుల, అన్నపూర్ణ, నేలపట్టు గ్రామంలో ఏఎన్ఎం వెంకమ్మ,  హెల్త్ అసిస్టెంట్ విజయ్ కుమార్, సచివాలయ ఏఎన్ఎం  రమణమ్మ, ఆశలు సుభాషిని, సుదర్శనమ్మ, పోలిరెడ్డి పాలెం సచివాలయ పరిధిలో రత్నయ్య, ఆశ కార్యకర్తస్వాతి, పాల్గొన్నారు