ప్రధానోపాధ్యాయుల సమావేశం 





 అనుమసముద్రంపేట మేజర్ న్యూస్  ఏఎస్ పేట లోనివెలుగు కార్యాలయం లో మండలం లోని ప్రభుత్వ పాఠశాలల ఎస్ ఎం సి చైర్మన్లు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్, పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో ఎంపీడీవో ఎంఈఓ ల కోఆర్డినేషన్ సమావేశం బుధవారం నిర్వహించారు ఈ సమావేశంలో పాఠశాల అభివృద్ధి లో ఎస్ ఎం సి లు, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్ ల పాత్ర గురించి చర్చించడం జరిగినది. పాఠశాలలలో అమలవుతున్న ప్రభుత్వ సౌకర్యాలలో ఎస్ఎంసి  లు, డబ్ల్యూ ఈ ఏ  లను భాగస్వామ్యం కలిపించాలన్నది రాష్ట్రప్రభుత్వ ముఖ్య ఉద్దేశం అని ఎంఈఓ జ్యోతి  తెలిపారు అలాగే ఈ కార్యక్రమం లో భాగంగా పాఠశాలలలో శానిటేషన్ కార్యక్రమాన్ని పరిశీలించాలని తెలుపుతూ ఎస్ఎంసిలు వారంలో ప్రతి బుధవారం, శుక్రవారాలలో మరియు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్ టాయిలెట్ మెయింటనెస్ ఫొటోస్ వారికి ఇచ్చిన లాగిన్ లో ఐ ఎం ఎం ఎస్ యాప్(imms app )లో అప్లోడ్ చేయాలని ఎంఈఓ- 2 డి సాయిప్రసాద్  వివరించారు.ఈ కార్యక్రమం లో పాఠశాలల చైర్మన్ లు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్, ప్రధానోపాధ్యాయులు, సి ఆర్ ఎం టి లు పాల్గొన్నారు.