నెల్లూరు.

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయం లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు
ఈ సందర్బంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి పై,సజ్జల రామకృష్ణా రెడ్డి పై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. బావా కాకాణి గోవర్దన్ రెడ్డి నామీద విమర్శలు ఆపి కోర్టులో నీ మీద విచారణకు సంబందించిన ఫైళ్లు పోయాయి,సీబీఐ వాళ్ళు నెల్లూరు వస్తున్నారు అవి చూసుకోండి నకిలీ పత్రాల కేసుకు సంబంధించిన కేసు విచారణ లో ఉండగా నెల్లూరు జిల్లా కోర్టు లో వుండే వేల ఫైళ్లు లో గోవర్దన్ రెడ్డి కేసుకు సంబందించిన ఫైల్ మాత్రమే పోయింది అంటే అందరూ మంత్రి గోవర్దన్ రెడ్డి వైపే చూస్తున్నారు దానికి మంత్రి సమాధానం చెప్పాలి .  మొదట్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం సోషల్ మీడియా లో ఎంతో కష్ట పడిన వారు ఇప్పుడు లేరు,ఇప్పుడున్న వారు సజ్జల రామకృష్ణా రెడ్డి గారి పెయిడ్ మనుషులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో కొనసాగడం నాకు ఇష్టం లేదు కాబట్టే అధికారం లో వుండగానే బయట వచ్చేశా . అధికారాన్ని వదులు కుని ప్రతిపక్షం లోకి పోవాలి అనుకున్నా కానీ  నామీద చేస్తున్న ఆరోపణలు కు నేను సమాధానం ఇచ్చుకోవాలి కాబట్టి మాట్లాడుతున్నా . అన్ని పాములు లేస్తే ఏలిగ పాము లేచినట్టు మా బావ మంత్రి కాకాణి గోవర్దన్ కూడా నిన్న మాట్లాడారు. ఆనం రామనారాయణరెడ్డి నిన్ను నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ ని చేస్తే నువ్వు ఆనం వాళ్లకు వెన్ను పాటు పొడవ లేదా గోవర్దన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ లోనుండి వైఎస్సార్ పార్టీ లోకి రమ్మంటే కాంగ్రెస్ అనేది సముద్రం లాంటిది అని జగన్మోహన్ రెడ్డి నీటి బొట్టు లాంటి వాడు అని అన్నది మరిచి పోయావా. పొదలకూరు మండలం లో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టనీకుండా అడ్డుకుంది మీరు కాదా. తనకు వచ్చిన బెదిరింపు ఫోన్ కాల్ పై స్పందించిన కోటంరెడ్డి. ఎమ్మెల్యే గా నాకు అనేక ఫోన్ కాల్స్ వస్తూ వుంటాయి అలాగే నిన్న నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది అవతలి వ్యక్తి నాపేరు బోరుగడ్డ అనిల్ అని నన్ను కొట్టుకుంటూ తీసుకు పోతా అని ఇంకా అనేక మాటలు మాట్లాడాడు,ఇతను సజ్జల కోఠరీ అని తెలిసింది. అయ్యా సజ్జల రమాకృష్టా రెడ్డి అన్ని పనులు మానుకుని ఆపరేషన్ నెల్లూరు అనే కార్యక్రమం పెట్టుకున్నట్టు వున్నాడు. నిన్న నా మీద కిడ్నాప్ కేసు పెట్టారు,ఇంకా ఎన్ని కేసులు  అయినా పెట్టుంకొండి వెనక్కు తగ్గేది లేదు.

నెల్లూరు నగర మేయర్ స్రవంతి మాట్లాడుతూ

నాకు పార్టీ జెండా ముఖ్యం కాదు,నాకు అజెండా లు లేవు నాది అంతా ఒకటే జెండా,అజెండా అది శ్రీధర్ అన్న తో కలిసి ఉండడమే. మేము కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెంటే వుంటాము,నాకు రాజకీయ బిక్ష పెట్టిన శ్రీధర్ అన్న వెంటనే వుంటాము. 
అవసరం అయితే నా మేయర్ పదవికి కూడా రాజీనామా చేస్తా . నాకు ఎన్నో ఫోన్ కాల్స్ వస్తున్నాయ్ వాళ్లకు నా నుండి ఒకటే సమాధానం నేను శ్రీధర్ అన్న వెంటే . మాది చాలా మధ్యతరగతి కుటుంబం మమ్మల్ని గుర్తించి ఈ స్థాయికి తీసుకు వచ్చిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెంటే చివరి వరకూ కొనసాగుతామని,మా జీవితం లో వెలుగులు నింపారని చెప్పిన మేయర్ స్రవంతి అవసరం అయితే రాజీనామా కు సిద్ధం అని ప్రకటించారు.