అల్లూరులో అల్లంపాటి విగ్రహావిష్కరణకు సన్నాహా ఏర్పాట్లు
అల్లూరులో అల్లంపాటి విగ్రహావిష్కరణకు సన్నాహా ఏర్పాట్లు
ప్రముఖ పారిశ్రామికవేత్త, అల్లూరులోని రామకృష్ణ విద్యా సంస్థల కరస్పాండెంట్, మితభాషి, సౌమ్యులు ... కీర్తి శేషులు శ్రీ అల్లంపాటి విజయవర్ధన్‌రెడ్డి విగ్రహాన్ని మండల కేంద్రమైన అల్లూరులో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
పుచ్చలపల్లి మధన్‌మోహన్‌రెడ్డి, మన్నెమాల సుకుమార్‌రెడ్డి ల ఆధ్వర్యంలో లేబూరు రవీంద్రరెడ్డి పర్యవేక్షణలో ఇందుకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి.
కాగా భవితరాలు అల్లంపాటి విజయవర్ధన్‌రెడ్డి సేవలను స్ఫూర్తిగా తీసుకోవాలనే సమోన్నత లక్ష్యంతో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కొద్ది రోజుల్లో అన్ని పనులు పూర్తి చేసుకుని పెద్దలను అల్లూరు కు ఆహ్వానించి విగ్రహాన్ని ఆవిష్కరించే కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.