శ్రీవారి రథ సప్తమి వేడుకల్లో ప్రశాంతిరెడ్డి
శ్రీవారి రథ సప్తమి వేడుకల్లో ప్రశాంతిరెడ్డి
బుచ్చిరెడ్డిపాలెం ,మేజర్ న్యూస్:
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి రథ సప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. తెల్లవారుజామునుంచే ప్రారంభమైన వాహన సేవలు భక్తులను తరింపజేస్తున్నాయి. రథ సప్తమి వేడుకల సందర్భంగా కోవూరు ఎమ్మెల్యే, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డితిరుమల శ్రీ వారి వాహన సేవలో పాల్గొన్నారు. తెల్లవారు జామున నిర్వహించిన సూర్య ప్రభ వాహన సేవలో టిటిడి బోర్డు ఛైర్మన్ బి.ఆర్ నాయుడు, ఈవో శ్యామల రావు , ఇతర బోర్డు సభ్యులతో కలిసి ఆమె వాహన సేవలో పాల్గొని శ్రీ వారిఆశీస్సులు అందుకున్నారు. రథ సప్తమి ఏర్పాట్లపై ఆయా అధికారులతో ప్రశాంతి రెడ్డి మాట్లాడారు.