ప్రజా జ్యోతి చైతన్య కళావేదిక ఆధ్వర్యంలో రెండు గొప్ప పద్య నాటక ప్రదర్శన





నెల్లూరు రూరల్ (మేజర్ న్యూస్ )

 విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి పురస్కరించుకొని నెల్లూరు రూరల్ నియోజకవర్గం లోని బుజ బుజ నెల్లూరు 25వ డివిజన్ నందు 27-1-2025 రాత్రి ఆరు గంటల నుండి సాంస్కృతి కార్యక్రమాలు, సత్యహరిచంద్ర మరియు బాలనాగమ్మ అను పౌరాణిక పద్య నాటకాలను ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో ప్రజా జ్యోతి చైతన్య కళావేదిక ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి  చేతుల మీదగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ... టిడిపి కూటమి ప్రభుత్వం కళాకారులను కలను ఆదుకుంటుందని కలలకు నిలయమైన మన నెల్లూరు ప్రాంతంలో ఎంతోమంది కళాకారులు మన రాష్ట్ర దేశ చరిత్రలో ఉన్నదని ఇలాంటి కళాకారుల ప్రదర్శన ఎంతో అభినందనీయమని  ఎన్టీఆర్ జీవిత చరిత్రను కొనియాడారు. ఆయన ఒక కళాకారుడుగా ఉండి  తొమ్మిది నెలల కాలంలోనే ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవనత్తకి పాత్రలో విజయరాణి భవాని పాత్రలో  మంద వెంకటరావు చూపరులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులుగా టిడిపి ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి  మాతంగి కృష్ణ మాట్లాడుతూ.... ప్రజా జ్యోతి కళా చైతన్య వేదిక చైర్మన్ అయిన రమణశ్రీ మీ అభినందిస్తూ  మన భారతదేశ కళలను సాంప్రదాయాలను ఇలాంటి కళావేదిక ద్వారా బ్రతికించుకోవాలని తెలియజేశారు. అనంతరం గౌరవ అతిథిగా జెన్ని రమణయ్య  మాట్లాడుతూ.... టిడిపి ప్రభుత్వం గతంలో కళాకారులకు తగిన ప్రోత్సాహం కల్పించిందన్నారు అదేవిధంగా భవిష్యత్తులో కూడా వారికి తగిన గుర్తింపు ఇస్తామని పేర్కొన్నారు. ఈ కళా వేదిక ఎనిమిది సంవత్సరాల నుండి ఎంతోమంది కళాకారులతో  ప్రదర్శనలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 25వ డివిజన్ కార్పొరేటర్  బద్దిపూడి నరసింహాగిరి, జీవన్ జ్యోతి స్వచ్ఛంద సేవా వ్యవస్థాపకులు మంద వెంకటరావు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం అధ్యక్షులు మిరియాల వెంకటరమణయ్య, సభ్యులు, వెంకటాద్రి, సింహాద్రి కామాక్షి ఆదిలక్ష్మి బుజ్జమ్మ శిరీష నాగమణి గంగ తదితరులు రంగస్థలం నాటకాలలో పాల్గొన్నారు. కళావేదిక చైర్మన్ రమణశ్రీ మాట్లాడుతూ... ఈ పౌరాణిక జానపద నాటకాలను కళాకారులు కళాభిమానులందరూ వచ్చి జయప్రదం చేయడం ఎంతో సంతోషకరంగా ఉందని తెలియజేశారు ఈ కార్యక్రమానికి అనుమతులు ఇచ్చిన ప్రభుత్వ అధికారులకు, కళాకారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.