శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. సులూరుపేట : కాళంగి నది ఒడ్డున ఉన్న లెప్రసికాలనీ కుటుంబాలకు ఎలాంటి సమాచారం మరియు నోటీసులు జారీ చేయకుండా విద్యుత్ శాఖ అధికారులు కరెంటు కట్ చేయడంతో 50 కుటుంబాలు రోడ్డుమీద బైఠాయించి ధర్నా చేపట్టారు. అందులో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్ స్తంభించడంతో విషయం తెలుసుకున్న సూళ్లూరుపేట ఎస్ ఐ పి రవి బాబు  తన సిబ్బందితో అక్కడికి చేరుకొని వారికి సర్ది చెప్పినప్పటికీ బాధితులు ససేమిరా అంటున్నారు.

బాధితుల వివరాలమేరకు గత 50 సంవత్సరాలుగా కాల్లంగి నది కరకట్ట మీద సుమారు 50 కుటుంబాలు కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నామని, గతంలో టిడిపి ప్రభుత్వం లెప్రసి వాళ్లని గుర్తించి  వారికి పట్టాలు ఇచ్చి కరెంటు సదుపాయం ఏర్పాటు   చేశారని, అయితే  ఇప్పుడు వైఎస్సార్ సిపి ప్రభుత్వం చెంగాలమ్మ గుడికి ఆ స్థలం అవసరమని వెంటనే స్థలాన్ని కాళీ చేయాలని అధికారులు తెలియజేసినప్పటికీ విద్యుత్ శాఖ అధికారులు వారికి ఎలాంటి సమాచారం లేకుండా విద్యుత్ సరఫరా నిలిపి వేయడం అదేవిధంగా స్థలాన్ని మొత్తం ఖాళీ చేయాలని హూంకు జారీ చేయడంతో బాధితులు రోడ్డుపై బైఠాయించారు.